Site icon TeluguMirchi.com

నెట్ లో చక్కర్లు కొడుతున్న చిరు , కాజల్ పిక్

chiru-kajal-Khaidi-No.150చిరంజీవి కథానాయకుడిగా వి.వి.వినాయక్ రూపొందిస్తోన్న చిత్రం ‘ఖైదీ నెంబర్150’. కాజల్ అగర్వాల్ కథానాయకిగా నటిస్తుండగా, చిరంజీవి 150 వ చిత్రంగా కొణిదెల ప్రొడక్షన్ కంపెనీపై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ‘బాస్ ఇస్ బ్యాక్’ అనేది ఉప శీర్షిక. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుపుకుంటుంది. తాజాగా ఎయిర్ పోర్ట్ లో కాజల్ , చిరు ఫై కొన్ని సీన్స్ చిత్రీకరించడం జరిగింది. దీనికి సంబంధిన పిక్ ఒకటి బయటకు వచ్చి సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది.

ఈ పిక్ లో కాజల్ అగర్వాల్ సింపుల్ గా బ్లూ టాప్ అండ్ పింక్ స్కర్ట్ లో కాస్త నడుము కనిపిస్తుండగా, చిరంజీవి మాత్రం ఆర్మీ గ్రీన్ టి షార్ట్ లో బ్లాక్ ప్యాంటు లో కనిపించాడు. ఈ పిక్ చూసిన అభిమానులు ఈ చిత్రం లో మెగా స్టార్ చాల యాంగ్ గా కనిపిస్తున్నాడని కామెంట్స్ వేస్తున్నారు. భారీ అంచనాల మధ్య ఈ సినిమా తెరకెక్కబోతుంది. తమిళ చిత్రం కత్తి చిత్రానికి ఇది రీమేక్ గా వస్తుంది. సంక్రాతి కానుకగా 2017 లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Exit mobile version