Site icon TeluguMirchi.com

చిరు మూవీ లో అడుగుపెట్టిన పూరి జగన్నాధ్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్..చిరంజీవి నటిస్తున్న గాడ్ ఫాదర్ మూవీ జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్నీ చిరంజీవి అధికారికంగా ట్విట్టర్ ద్వారా తెలియజేసాడు.

నర్సీపట్నం నుంచి ఓ కుర్రాడు,వెండితెర పైన నటుడిగా వెలుగు వెలగాలని,హైదరాబాద్ వచ్చాడు.ఒకటి అరా వేషాలు వేసాడు ఇంతలో కాలం చక్రం తిప్పింది.స్టార్ డైరెక్టర్ అయ్యాడు.కానీ అతని మొదటి కల అలా మిగిలిపోకూడదు కదా..అందుకే అంటూ పూరి సినిమాలో జాయిన్ అయినా విషయాన్ని చిరంజీవి తెలిపాడు.

మెగాస్టార్ చిరంజీవి 153వ సినిమా గాడ్ ఫాదర్. మోహన్ రాజా తెరకెక్కిస్తుండగా.. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిల్మ్స్ కలిసి సంయుక్తంగా భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. మెగాస్టార్ సినిమా అంటే అభిమానులకు ఎలాంటి అంచనాలుంటాయో తెలిసిన దర్శకుడిగా మోహన్ రాజా.. ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామాకు మన తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశారు.

Exit mobile version