చిరు ప‌చ్చజెండా ఊపాడు!

chiru
ఎవ‌డు విజ‌యానందంలో సంక్రాంతి పండ‌గ చేసుకొంటున్న మెగాఫ్యాన్స్ కి మ‌రో శుభ‌వార్త‌. మెగాస్టార్ కూడా వ‌చ్చే యేడాది సంద‌డి చేయ‌బోతున్నాడు. త‌న 150 వ సినిమాతో మ‌రిపించ‌బోతున్నాడు. అవును.. చిరంజీవి 150వ సినిమా ఉంటుందా..? ఉండ‌దా?? అనే అనుమానాల‌కు తెర దించుతూ స్వయంగా చిరునే ప‌చ్చజెండా ఊపేశాడు. ఎన్నిక‌ల త‌ర‌వాత సినిమాల్లోకి వ‌చ్చేస్తా.. అని ప్రక‌టించాడు. ఆ సినిమా వినాయ‌క్ ద‌ర్శ‌క‌త్వంలో ఉంటుంద‌ని చిరంజీవి చెబుతున్నారు. శ‌నివారం ఆయ‌న అభిమానుల‌ను ఉద్దేశించి మాట్లాడుతూ… ”150వ సినిమా ఉంది. చిన్నికిర‌ణ్ ఓ క‌థ సిద్ధం చేశాడు. దానితో పాటు ఇంకొన్ని క‌థలు కూడా ప‌రిశీలిస్తున్నాం..” అన్నారు.