Site icon TeluguMirchi.com

చిరు దీపావళి గిఫ్ట్ ఇదే..

chiru-diwali-giftమెగాస్టార్ చిరంజీవి చాల కాలం తర్వాత మళ్లీ వెండి తెరపై ‘ఖైదీ నెం. 150’ తో రాబోతున్నాడు..చిరంజీవి కెరియర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ ఠాగూరు మూవీ ని ఇచ్చిన వినాయక్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించడం తో మెగా అభిమానుల్లోనే కాకుండా సినీ ప్రేక్షకులు మొత్తం ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు..

ఇప్పటికే షూటింగ్ 90% పూర్తి చేసుకుందని సమాచారం..ఇప్పటికే ఫస్ట్ లుక్ తో అదరగొట్టిన చిరు, దీపావళి కి మరో లుక్ తో అంచనాలను రెట్టింపు చేయడానికి వస్తున్నాడు..ఇప్పటికే ఈ లుక్ కు సంబంధించిన ఫ్రీ లుక్ ను వినాయక్ విడుదల చేయడం జరిగింది.తమిళం లో సూపర్ హిట్ అయినా కత్తి చిత్రానికి రీమేక్ గా తెలుగులో రాబోతుంది. చిరు కు జోడిగా కాజల్ నటిస్తుండగా , ఐటెం సాంగ్ లో లక్ష్మి రాయ్ కనిపించబోతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కొణెదల ప్రొడక్షన్ బ్యానర్ ఫై ఈ సినిమాను నిర్మించడం జరుగుతుంది.

Exit mobile version