మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘సైరా’ చిత్రానికి కాస్ట్యూమ్ డిజైనర్‌గా చిరు కూతురు సుస్మిత పని చేసింది. ఈ చిత్రం స్వాతంత్రానికి పూర్వం, 1800ల నేపథ్యంలో జరిగిన కథగా రూపొందిందిం. అప్పట్లో మహిళలలు ఎలాంటి చీరలు ధరించేవారు, అవి ఎలా ఉండేది అని సుస్మిత రీసెర్చ్ చేసి మరి చీరలను డిజైన్ చేసిందట. తాజాగా మీడియాతో ముచ్చటించిన సుస్మిత ఈ సినిమా కోసం చెన్నై వదిలి హైద్రాబాద్‌లోనే ఉండాల్సి వచ్చింది. ఈ సమయంలో ఆయన్ను చాలా మిస్ అయ్యాను. ఇకపోతే రెండేళ్లు ఈ ప్రాజెక్ట్ కోసం చాలా కష్టపడ్డాం అని సుస్మిత చెప్పుకొచ్చింది.
నయన్, తమన్నాలు ధరించిన చీరలు 12 అడుగుల పొడవు గల పట్టు చీరలు. అప్పట్లో పట్టు చీరలు ఇలాగే ఉండేవి. అయితే ఈ చీరలు హీరోయన్లకు సౌకర్యవంతంగా ఉన్నాయా?, బరువు ఎక్కువగా ఉన్నాయా? అని చూడడానికి మొదటగా నేనే వారి చీరలు ధరించా. నాకు ఒకే అనిపించాకే ఇక వీటి ఫైనల్ సెలక్షన్ జరిగింది. నయన్, తమన్నాల కాస్ట్యూమ్స్ అందరికి నచ్చుతాయి. ఇలాంటి గొప్ప సినిమాకు పని చేయడం ఛాలెంజింగ్ విషయమే. కానీ ‘సైరా’ భాగస్వామ్యం అవడం అదృష్టంగా భావిస్తాను అంటూ చిరు తనయ సుస్మిత చెప్పుకొచ్చింది. గతంలో ఈమె డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్‌కు మంచి స్పందన వచ్చింది.