మెగాస్టార్ చిరంజీవి అంటే మెగా అభిమానుల్లోనే కాదు చిత్రసీమ లోను అంతే గౌరవం. ఆయన మాటకు ఎంతో గౌరవిస్తారు. అలాంటి మెగా స్టార్ సూపర్ స్టార్ ఫై ప్రశంసల జల్లు కురిపించడం మహేష్ అభిమానుల్లో ఆనందం నింపుతుంది. తాజాగా ప్రముఖ పత్రికకి ఇంటర్వ్యూ ఇచ్చిన చిరంజీవి..ఆచార్యలో మహేష్ నటిస్తున్నాడన్న వార్త ఎలా బయటకి వచ్చిందో అర్ధం కావడం లేదు అని అన్నారు. మహేష్‌ని నేను చాలా గౌరవిస్తాను. ఆయన కూడా నన్ను అంతే ప్రేమిస్తారు. మహేష్ నాకు కొడుకు లాంటి వాడు అని స్పష్టం చేశారు. మహేష్ తో కలిసి సినిమా చేసే ఛాన్స్ వస్తే తప్పక చేస్తానని చెప్పుకొచ్చారు.
మహేష్ బాబు నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు . ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా హాజరైన సంగతి తెలిసిందే. ఆ ఈవెంట్లో మహేష్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. ఇప్పుడు మరోసారి అదే లెవల్లో మాట్లాడడం అందర్నీ సంతోష పెడుతుంది. ప్రస్తుతం చిరు కొరటాల శివ డైరెక్షన్లో ఆచార్య మూవీ చేస్తున్నాడు.