సీసీసీ.. వీడియో పోస్ట్ చేసిన మెగాస్టార్

కరోనా వైరస్‌ విజృంభిస్తుండటంతో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా జీవనోపాధి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకొనేందుకు నటుడు చిరంజీవి నేతృత్వలో కరోనా క్రైసిస్‌ ఛారిటీ (సీసీసీ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.
చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీసీ కి నటులు, దర్శక నిర్మాతల నుంచి ఇప్పటి వరకు రూ. 7 కోట్లకుపైగా విరాళాలు సమకూరాయి. 24 విభాగాల్లోని నిరుపేద సినీ కార్మికుల జాబితాను సిద్ధం చేసిన సీసీసీ వారికి కావాల్సిన నిత్యావసరాలను అందించనుంది.

దీనిద్వారా సమకూరిన నిధులతో సినీ కార్మికుల కోసం నిత్యావసరాలను పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ‘సినీ కార్మికుల ఇళ్లకు నేరుగా ఈ వస్తువులను పంపిణీ చేసే ఈ ప్రక్రియ మొదలైంది’ అంటూ చిరంజీవి ఓ వీడియోను తన ట్విటర్‌ హ్యాండిల్‌లో పోస్ట్‌ చేశారు.