బోయపాటి దర్శకత్వం లో చిరు చిత్రం..?

chiru-boyapatiభద్ర , తులసి , సింహ , లెజెండ్ , తాజాగా సరైనోడు ఇలా బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందించిన బోయపాటి శ్రీను త్వరలోనే మెగా స్టార్ చిరంజీవి ని డైరెక్ట్ చేయబోయే అవకాశం వచ్చిందనే వార్తలు ఫిల్మ్ సర్కిల్ లో వినిపిస్తున్నాయి..ప్రస్తుతం 150 వ చిత్రం కత్తిలాంటోడు షూటింగ్ లో బిజీ గా ఉన్న చిరంజీవి , ఈ చిత్రం పూర్తి కాగానే బోయపాటి శ్రీను దర్శకత్వం లో తన 151 వ చిత్రాన్నిచేస్తాడని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇప్పటికే మంచి కథను సిద్ధం చేయమని శ్రీను చెప్పడం జరిగిందట..మరోపక్క త్రివిక్రమ్ దర్శకత్వం లో ఓ ఫ్యామిలీ చిత్రాన్ని చేయబోతాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి..చూద్దాం ఎవరికి ఆ అవకాశం దక్కుతుందో..