మెగాస్టార్ చిరంజీవి ఎవరైనా ఆపదలో ఉంటె వెంటనే వారిని ఆదుకునేందుకు తనవంతు సాయం చేస్తుంటాడు. ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ఇబ్బంది పడుతున్న సినీ కార్మికుల కోసం సీసీసీ చారిటిని ఏర్పటు చేసి వారి కుటుంబం లో ఆనందం నింపారు. చిరు చేసిన ఈ పనికి పెద్ద ఎత్తున అంత హర్షం వ్యక్తం చేస్తుండగా…తాజాగా ఓ లేడి ఫ్యాన్ కు ఆరోగ్యం బాగాలేదని తెలిసి ఆమెకు ఆర్ధిక సాయం చేసాడు.
గుంటూరుకు చెందిన చిరు మహిళా అభిమాన సంఘం అధ్యక్షురాలు నాగ లక్ష్మి గుండె జబ్బుతో బాధపడుతోందని తెలుసుకున్న చిరు ఆమె వైద్యానికి కావలసిన ఖర్చులు భరిస్తానని మాట ఇచ్చారట. స్టార్ హాస్పిటల్లో రేపు ఆమె శస్త్ర చికిత్స జరగనుందని తెలుస్తుంది. లాక్డౌన్ కారణంగా చిరు ఆమెని పరామర్శించడానికి వెళ్లకపోవొచ్చని సమాచారం .