కరోనా నేపథ్యంలో విధించిన లాక్డౌన్తో ఉపాధి కోల్పోయిన సినీ కార్మికులను ఆదుకొనేందుకు రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీ రావు తనవంతు సాయం అందించారు. కరోనా క్రైసిస్ ఛారిటీ కి రూ.10లక్షలు విరాళంగా ఇచ్చినట్టు చిరంజీవి వెల్లడించారు. ఈ సందర్భంగా రామోజీరావుకు చిరంజీవి కృతజ్ఞతలు తెలిపారు.
టాలీవుడ్లోని సినీ కార్మికుల కోసం చిరు చొరవతో ప్రముఖులంతా కలిసి ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. దీనికి ఇప్పటికే అనేక మంది సెలబ్రిటీలు విరాళాలు ఇచ్చారు. ఈ నగదుతో ఛారిటీలోని సభ్యులు కార్మికులకు నిత్యావసరాలు సరఫరా చేస్తున్నారు.