చిరు మెచ్చుకొన్నారు

sai-dharam-tejమెగా ఇంటి నుంచి మ‌రో హీరో వ‌స్తున్నాడు. అత‌నే…. సాయిధ‌ర‌మ్ తేజ్‌…… ‘రేయ్’తో ఎంట్రీ ఇస్తున్న సాయి చిరంజీవి మేనల్లుడు. వైవిఎస్ చౌద‌రి స్వీయ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమా కోసం చౌద‌రి.. భారీ ఎత్తున ఖ‌ర్చు పెడుతున్నారు. సాయిధ‌ర‌మ్ తేజ్‌ని విభిన్నమైన రీతిలో తీర్చిదిద్దడానికి ప్రయ‌త్నిస్తున్నారు. ఇటీవ‌ల ఈ స్టిల్స్ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అవి చూసి సవ్యయంగా చిరంజీవి మెచ్చుకొన్నారు. నేను ప‌రిశ్రమ‌లోకి అడుగు పెట్టిన తొలి రొజుల్లో ఎలా ఉన్నానో, ఇప్పుడు సాయి ధ‌ర‌మ్ అలా ఉన్నాడు. ఇది కేవ‌లం నా ఒక్కడి అభిప్రాయం మాత్రమే కాదు. ఇంట్లో వాళ్లంతా ఈ మాటే అంటున్నారు. రేయ్ స్టిల్స్ నాకు బాగా న‌చ్చాయి. ఈ సినిమా బాగా వ‌స్తుంద‌ని తెలిసింది. టీమ్‌ కి నా అభినంద‌న‌లు… అని చిరు త‌న సందేశంలో పేర్కొన్నారు. చిరు పొగ‌డ్తల‌కు ద‌ర్శకుడు వైవిఎస్ చౌద‌రి కూడా తెగ పొంగిపోతున్నారు. చిరు ఫోన్ చేసి అభినందించ‌డం మ‌ర‌చిపోలేని విష‌య‌మ‌ని.. ఆయ‌న చెబుతున్నారు.