మెగాఫ్యాన్స్ అంత సిద్దంకండి..

సైరా నరసింహ రెడ్డి తో యావత్ ప్రేక్షకులను ఆకట్టుకున్న మెగాస్టార్ చిరంజీవి..ప్రస్తుతం కొరటాల డైరెక్షన్లో తన 152 వ చిత్రం ఆచార్య చేస్తున్నాడు. ఈ చిత్రంలో చిరంజీవి డబుల్ రోల్ చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుండగా.. సిద్దు.. ఆచార్య అనే రెండు విభిన్నమైన పాత్రల్లో చిరంజీవి కనిపించబోతున్నాడని అంటున్నారు.

ఇక ఈ మూవీ తాలూకా ఫస్ట్ లుక్ ను ఉగాది పర్వదినాన అనగా మార్చి 25 న రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇప్పటివరకు సోషల్ మీడియా లో ఈ చిత్రం పట్ల అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నప్పటికీ చిత్ర యూనిట్ మాత్రం దీనిపై స్పందించలేదు. ఒకేసారి ఫస్ట్ లుక్ తో అన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టాలని డిసైడ్ అయ్యినట్లు తెలుస్తుంది. మరి ఫస్ట్ లుక్ లో చిరు ఎలా ఉంటారో..టైటిల్ ఏం పెడతారో చూడాలి. రామ్ చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చాలా కాలం తరువాత మెలోడీ బ్రహ్మ మణిశర్మ చిరంజీవి చిత్రానికి సంగీతం అందిస్తుండడం విశేషం.