Site icon TeluguMirchi.com

‘ఆదిశంకర’ లో ‘మెగా’ స్వరం

chiranjeevi voiceover for adhisankaraమెగాస్టార్ 150 చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో చిరు మాత్రం తన వాయిస్ ఓవర్ తో మెగా అభిమానులను అలరించనున్నారు. అవును… అక్కినేని నాగార్జున, మోహన్ బాబు అతిధి పాత్రల్లో నటిస్తున్న ఆధ్యాత్మిక చిత్రం ఆది శంకరాచార్య కోసం చిరు వాయిస్ ఓవర్ అందించనున్నారు. గ్లోబల్ సినీ క్రియేషన్స్ బ్యానర్ పై కౌశిక్ బాబు హీరోగా నటిస్తున్న ఈ సినిమాకి జె.కె భారవి దర్శకుడు. చిత్రం ప్రారంభంలో వాయిస్ ఓవర్ గా మెగా స్టార్ మాట వినిపిస్తుందని సమాచారం.

ఇక ఆది శంకరాచార్య చిత్రం… హిందూ ధర్మాన్ని నిలబెట్టిన ఆది శంకరుడి దివ్య చరిత్రలో ఆ మహనీయుడి జీవితాన్ని మలుపు తిప్పిన అత్యంత కీలకమైన ఒక పాత్రలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉందని, భారతీయుడిగా అది నా బాధ్యతగా భావిస్తున్నానని హీరో నాగార్జున ఇదివరకే పేర్కొన్నారు. మరో ముఖ్య పాత్రలో కలక్షన్ కింగ్ మోహన్ బాబుతో పాటు ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర కూడా ఈ చిత్రంలో కనిపించనున్నారు. ఆదిశంకరుడి పాత్రలో కౌషిక్, రియల్ స్టార్ శ్రీహరి, డైలాగ్ కింగ్ సాయికుమార్, మెగా బ్రదర్ నాగ బాబు, సుమన్, జయప్రద, రోహిణి, రోజా, తులసి, ఆనంద్, నాగబాబు, అశోక్ కుమార్, శివ పార్వతి, సంగీతలతో పాటు మరికొందరు ప్రముఖులు నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్ ఇప్పటికే విడుదలై మంచి రెస్పాన్స్ ను సంపాదించుకొంది. నాగ శ్రీవాత్సవ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ఆడియో ను మార్చి లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Exit mobile version