బోయపాటికి చిరు సూచనలు

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనివాస్ కాంబినేషన్‌లో సినిమాఇటివలే ప్రారంభమైంది.తొలి షెడ్యుల్ కూడా డు పూర్తయింది. అయితే ఇది చరణ లేకుండానే జరిగింది. రామ్ చరణ్ రంగస్థలం కారణంగా షూట్ కు వచ్చే పరిస్థితి లేదు. అందుకే సినిమాలో వున్న కొన్ని క్యారెక్టర్లతో తొలి షెడ్యూలు లాంఛనం పూర్తి చేసారు.

అయితే ఈ సినిమా విషయంలో తాజాగా బోయపాటికి రెండు సూచనలు ఇచ్చారట మెగాస్టార్ చిరంజీవి. ”కథను బట్టి యాక్షన్ సీన్స్ చేయండి .. రక్తపాతం వుండకూడదు. అలాగే కామెడీకి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం మరిచిపోవద్దు” చెప్పారట చిరు.

ఈ సినిమా దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై దానయ్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇంకోపక్క రామ్ చరణ్ ‘రంగస్థలం’ సినిమా చిత్రీకరణ ఆఖరి షెడ్యూల్‌ త్వరలో పూర్తికానుంది. ఈ సినిమా మార్చిలో ప్రేక్షకుల మధ్యకు రానుంది.