మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి విడుదలకు సిద్దం అయ్యింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ట్రైలర్‌ను నేడు విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ చిత్రం ట్రైలర్‌ను పెద్ద ఎత్తున థియేటర్లలో ప్రదర్శించారు. ట్రైలర్ విడుదల కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్ నేడు పండుగ చేసుకున్నారు. మొదటి నుండి చెబుతున్నట్లుగానే అద్బుతమైన విజువల్స్ తో భారీ యుద్ద సన్నివేశాలతో ఈ చిత్రం ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది.
చిరంజీవి పవర్ ఫుల్ డైలాగ్స్ మరియు అమితాబ్ ఇంకా ఇతర ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కనిపించబోతున్నారు. వారి పాత్రలకు సంబంధించిన షాట్స్‌ను కూడా ట్రైలర్లో చూపించారు. సినిమాపై అంచనాలును పీక్స్‌కు తీసుకు వెళ్లేలా ట్రైలర్ ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంకా సినిమాటోగ్రఫీ అద్బుతంగా ఉండబోతుందని ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తుంది. ట్రైలర్ విడుదల తర్వాత సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. మీరు ఈ ట్రైలర్‌పై ఒక లుక్కేయండి.