మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రంను తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడంలో విడుదలకు సిద్దం చేస్తున్నారు. రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెల్సిందే. ఇక ఈ చిత్రంను తమిళ డబ్బింగ్ రైట్స్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిల్మ్స్ దక్కించుకుంది. తెలుగులో మరియు తమిళంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించిన సూపర్ గుడ్ ఫిల్మ్స్ వారు ఇప్పుడు సైరా చిత్రాన్ని పంపిణీ చేయడానికి ముందు రావడంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.
సైరా చిత్రంను తమిళంలో అదే టైటిల్‌తో విడుదల చేయబోతున్నారు. నేను ట్రైలర్‌ను సదరు నిర్మాణ సంస్థ ప్రతిష్టాత్మకంగా విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసింది. చెన్నైలో చిరంజీవి మరియు రామ్ చరణ్‌లు ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. ఇంకా ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో నటించడం వల్ల తమిళనాడులో కూడా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ చిత్రంను సురేందర్ రెడ్డి తెరకెక్కించాడు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెల్సిందే.