మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్‌లో ప్రత్యేక గుర్తింపును పొంది ఆ తర్వాత రాజకీయ అరంగేట్రం చేశాడు. తెలుగు సినీ చరిత్రలో నెం.1 హీరోగా పేరు తెచ్చుకున్న చిరు రాజకీయరంగ ప్రవేశం చేశాక చాలామంది చేత విమర్శల పాలయ్యాడు. చిరుకు స్నేహితులైన చాలామంది సినీ రంగంకు చెందిన ప్రముఖులు రాజకీయ పరంగా చిరు పట్ల నిప్పులు చెరిగారు. రాజకీయ పరంగా ఏమాత్రం గుర్తింపు తెచ్చుకోని చిరు మళ్లీ సినిమాల్లోకి రాడమే మంచిది అని డిసైడ్ అయ్యి దాదాపు తొమ్మిది సంవత్సరాల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చి మాంచి హిట్‌ను సొంతం చేసుకున్నాడు. చిరుకు రాజకీయంగా కలిసి రాలేదు కానీ సినిమా పరంగా మంచి నటుడు అనేది అందరికి తెలిసిన విషయమే. అందుకే చాలా విరామం తీసుకున్నా కూడా రీఎంట్రీ చిత్రం ఘనవిజయం సాధించింది.
హీరోగా నటిస్తూనే ప్రముఖ టీవీ ఛానెల్‌లో వచ్చే ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ఈ షోతో చిరు తనలోని కొత్త యాంగిల్‌ను కూడా బయట పెట్టాడు. తాజాగా ఈ కార్యక్రమానికి నిన్నటితరం స్టార్ హీరోయిన్ రోజా హాజరయ్యింది. రాజకీయంగా రోజా ,చిరు మాటల కత్తులు దూసుకున్నా కూడా వృత్తిపరంగా మాత్రం మంచి మిత్రులే. ఈ ఇద్దరి కాంభోలో మంచి హిట్ చిత్రాలు వచ్చాయి. తాజాగా ఈ షోలో అప్పటి హిట్ సాంగ్‌లకు స్టెప్పులేసి దుమ్ములేపారు. అంతేకాకుండా జోకులతో షోను రక్తి కట్టించారు. ఇలా చిరు, రోజాలు షోను ఆడుతు పాడుతూ చేస్తు చివరకు రోజా మనం మళ్లీ కలిసి నటిస్తామా..?? అని అడగగా అవకాశం వస్తే తప్పకుండా కలిసి మరో చిత్రాన్ని చేద్దాం అంటూ మాట ఇచ్చాడు. చిరుతో మళ్లీ నటించాలని కోరిక పడుతున్న రోజా కోరిక చిరు తీరుస్తాడా చూడాలి.