Site icon TeluguMirchi.com

నా స్థానంలో చ‌ర‌ణ్ వ‌చ్చాడు: చిరంజీవి

chiranjeeviచిరంజీవి పుత్రోత్సాహంలో ఉన్నారు. రామ్‌చ‌ర‌ణ్ ఎదుగ‌ద‌ల ఆయ‌న‌కు అన్ని విధాలా సంతృప్తినిచ్చింది. ‘నా స్థానం చ‌ర‌ణ్‌దే..’ అని బాహాటంగానే చెప్పేశారు. అంటే త‌ర‌వాతి మెగాస్టార్ చ‌ర‌ణ్ అనే క‌దా?? ”చ‌ర‌ణ్ చాలా తొంద‌ర‌గా అన్ని విష‌యాలూ నేర్చుకొన్నాడు. నేనేం స‌ల‌హాలు కూడా ఇవ్వను. ఎవ‌రికి సంబంధించిన నిర్ణయాలు వాళ్లే తీసుకోవాల‌నేది నా అభిప్రాయం. త‌న‌లో ఇంత టాలెంట్ ఉంది అని కూడా నాకు తెలీదు. మగ‌ధీర‌తో చాలా ఎత్తుకు ఎదిగాడు. ఇప్పుడు జంజీర్‌తో బాలీవుడ్‌కి వెళ్తున్నాడు. ఈ సినిమా ఎప్పుడైతే అత‌ని చేతికొచ్చిందో అప్పుడే హిట్ కొట్టేశాడు. ఎందుకంటే అమితాబ్ బ‌చ్చన్ పాత్ర ద‌క్కడం అషామాషీ వ్యవ‌హారం కాదు” అని చెప్పుకొచ్చారు. త‌న 150వ సినిమా గురించి ప్రస్తావిస్తే… ”చిత్రప‌రిశ్రమ‌లో దశాబ్దాలుగా ఉన్నా. ఇప్పుడు ప్రత్యేకంగా నిరూపించుకోవ‌ల‌సింది ఏముంది..?” అంటూ స‌మాదానం దాట‌వేశారు.

Exit mobile version