మెగాస్టార్ చిరంజీవి తొమ్మిది సంవత్సరాలు వెండి తెరకు దూరంగా ఉండి ఆ తర్వాత ‘ఖైదీ నెం. 150’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రీమేక్‌తో చిరు రీ ఎంట్రీపై చాలా మంది విమర్శలు చేశారు. కాని ‘ఖైదీ నెం. 150’ విడుదలయ్యాక ఫలితాలు చూసి అలా అన్నవారంతా నోరెల్లబెట్టారు. ఈ చిత్రం విడుదలైన మొదటి షో నుండే మంచి టాక్‌ను సొంతం చేసుకుని కలెక్షన్ల విషయంలో దూసుకుపోయింది. టాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం ‘బాహుబలి’ తర్వాత తెలుగులో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా చిరు ‘ఖైదీ’ నిలిచింది. వినాయక్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇటు చిరుతో పాటు దర్శకుడికి కూడా మంచి ప్లస్ అయ్యింది.
ఈ చిత్రంలో చిరు సరసన కాజల్ అగర్వాల్ రొమాన్స్ చేసి మంచి గుర్తింపును సొంతం చేసుకోగా చిరు తనయుడు రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మించి అత్యధిక లాభాలను పొందాడు. చరణ్ నిర్మించిన మొదటి చిత్రమే పెద్ద సక్సెస్ అవడంతో చిరు తదుపరి చిత్రాన్ని కూడా నిర్మించడానికి రామ్ చరణ్ రెడీ అయ్యాడు. తాజాగా ఈ చిత్ర శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ చానెల్ కొనుగోలు చేసింది. శాటిలైట్ హక్కుల కోసం ఏకంగా 12కోట్లను వెచ్చించి స్టార్ మా వారు సొంతం చేసుకున్నారు. శాటిలైట్ హక్కులు భారీగా అమ్ముడైన చిత్రాలలో మొదటిది పవన్ ‘కాటమరాయుడు’ కాగా రెండో చిత్రంగా చిరు ‘ఖైదీ’ నిలిచింది.