‘ఉక్రెయిన్’ వెళ్లనున్న చిరు – కాజల్

chiranjeevi-&-Kajal-Ready-fమెగా స్టార్ చిరంజీవి – కాజల్ జంటగా వినాయక్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఖైదీ నెంబర్ 150’. ఇప్పటికే చిత్రంలోని కీలక సన్నివేశాలు చిత్రీకరించిన వినాయక్ , ఇటీవలే సినిమాలో హైలైట్ అయిన ఐటెం సాంగ్ కూడా పూర్తి చేసాడు. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ నేతృత్వం లో ఈ సాంగ్ కంపోజ్ చేయడం జరిగింది. ఇక మాస్ సాంగ్ లో చిరు తో పాటు మాస్ స్టెప్స్ అదరగొట్టిందట లక్ష్మి రాయ్.

ఇక తాజాగా చిత్ర యూనిట్ మిగిలి ఉన్న చిరంజీవి – కాజల్ డ్యూయెట్స్ కోసం ‘ఉక్రెయిన్’ వెళ్లనుందని సమాచారం. అక్కడి అందమైన లొకేషన్స్ లో ఒకటి రెండు పాటలను ప్లాన్ చేశాడట డైరెక్టర్. ఈ రెండు పాటలకు అదిరిపోయే మెలోడీ దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చాడని టాక్. అనుకున్నట్లు అన్ని పనులు త్వరగా పూర్తి చేసుకొని జనవరి లో సంక్రాంతి బరిలో ఈ ‘ఖైదీ ‘ నిలబెట్టేందుకు దర్శక , నిర్మాతలు ప్లాన్ చేసారు.