150వ చిత్రం.. మల్టీ స్టారర్ ??

chiru charanమెగాస్టార్ చిరంజీవి అభిమానులను ఊరిస్తున్న చిరు 150 చిత్రం పై ఓ క్లారిటీ వచ్చింది. 150 చిత్రం చేయడానికి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా చిరు 150 సినిమా పై మరో ఆసక్తికరమైన తెలిసింది. చిరు 150 చిత్రం ఓ రీమేకట. వివరాల్లోకి వెళితే.. సంక్రాంతి రేసులో తమిళంలో విడుదలైన ‘జిల్లా’ చిత్రం చిరుకు అమితంగా ఆకట్టుకుందట. ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నట్టు ఫిలింనగర్ సమాచారం. మోహన్ లాల్, విజయ్ నటించిన ‘జిల్లా’ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ రీమేక్ లో మోహన్ లాల్ పాత్రను చిరంజీవి, విజయ్ పాత్రను తనయుడు రామ్ చరణ్ తో చేయించాలని చిరంజీవి ఆలోచిస్తున్నట్టు బోగట్టా. ఇదే జరిగితే చిరు 150చిత్రం అభిమానుకలు డబల్ ధమాకా.