Site icon TeluguMirchi.com

Chiranjeevi : అదొక్కటి మాత్రం చెప్పలేదు.. అందుకే వరుణ్ మీద కోపం : చిరంజీవి


మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ అవైటెడ్ ఎయిర్ ఫోర్స్ యాక్షనర్ ‘ఆపరేషన్ వాలెంటైన్’. శక్తి ప్రతాప్ సింగ్ హడా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, సందీప్ ముద్దా రినైసన్స్ పిక్చర్స్ నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను అద్భుతంగా ఆకట్టుకోవడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం మార్చి 1న తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ మ్యాసీవ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించింది. పద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు ముఖ్య అతిధిగా హాజరైన ప్రీరిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

ఈ ఈవెంట్లో యాంకర్ సుమ చిరంజీవి గారిని కొన్ని ప్రశ్నలు అడిగారు. చిరు లీక్స్ అంటే మాకు ఎంతో ఇష్టం. చిరు లీక్స్ ను మేమెంతగానో ఎంజాయ్ చేస్తాం. మరి వరుణ్, లావణ్య లవ్ గురించి మీరు ఎందుకు లీక్ చేయలేదు ? మీకు కూడా ఆ లీక్ రాలేదా ? అని సుమ అడగ్గా చిరంజీవి గారు.. వరుణ్ ప్రతిదీ నాతో షేర్ చేసుకుంటాడు. కానీ వరుణ్, లావణ్య లవ్ గురించి మాత్రం చెప్పలేదు. నన్ను చూసి చాలా విషయాల్లో ఇన్స్పిరేషన్ అంటాడు.. అలాంటిది లీక్స్ విషయం కూడా ఇన్స్పైర్ అయి నాతో చెప్పొచ్చు కదా. వాళ్ల నాన్నకి చెప్పలేనివి కూడా నాకు చెప్తాడు. కానీ ఇది చెప్పలేదు. అందుకు నాకు వరుణ్ మీద కోపం ఉంది అన్నారు. అప్పుడు వరుణ్.. అది గౌరవంతో కూడిన భయం అందుకే చెప్పలేదు. కానీ అంత ఓకే అనుకున్నాక మొదట పెదనాన్నకే చెప్పాను అని అన్నారు.

Exit mobile version