జయహో ‘బాహుబలి 2’ అంటున్న మెగాస్టార్‌

దాదాపు అయిదు సంవత్సరాలుగా తెరకెక్కి ఏడాదిన్నర క్రితమే మొదటి పార్టు విడుదలయ్యి రెండో పార్టు పట్ల చాలా ఆసక్తిని కలిగించింది. ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ‘బాహుబలి 2’ చిత్రం తాజాగా విడుదలయ్యి గతంలో సినీ పరిశ్రమలో ఉన్న రికార్డులన్నీ కూడా బ్రేక్‌ చేస్తోంది. ఈ చిత్రాన్ని చూసిన సినీ ప్రముఖులంతా కూడా ‘బాహుబలి’ టీంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇప్పటికే చాలామంది ప్రముఖులు ‘బాహుబలి’ని పొగడ్తలతో ముంచెత్తారు. తాజాగా ‘బాహుబలి 2’ చిత్రాన్ని వీక్షించిన మెగాస్టార్‌ చిరంజీవి ఈ చిత్రంపై స్పందించాడు.

‘బాహుబలి 2’ చిత్రాన్ని చూసిన చిరంజీవి జయహో రాజమౌళి, జయహో ‘బాహుబలి’ అని పొగిడారు. అంతేకాకుండా ఈ చిత్రంలో నటించిన ప్రతి ఒక్క నటీనటులను కూడా అభినందించారు. ఇంత విజయం సాధించింది కాబట్టి దాని వెనుక ఎంతో కష్టం ఉంది, వారందరికి కూడా అభినందనలు అంటూ చిరు ‘బాహుబలి 2’చిత్రంపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు కూడా దర్శకుడు రాజమౌళిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్‌, రానా, అనుష్కలు ప్రధాన పాత్రల్లో నటించారు.