ఆ విషయమై క్లారిటీ ఇచ్చిన చిరు

చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి టీజర్‌ నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ తెరకెక్కిన సైరా చిత్రంతో చిరంజీవి బాలీవుడ్‌లో కూడా సందడి చేయబోతున్నాడు. సైరా టీజర్‌ను ముంబయిలో విడుదల చేయడం జరిగింది. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడం మరియు మలయాళంలో ఈ చిత్రంను విడుదల చేయబోతున్నారు. అందుకోసం అయిదు భాషల్లో కూడా టీజర్‌ను విడుదల చేశారు. అయిదు భాషల్లో కూడా వాయిస్‌ ఓవర్‌తో టీజర్‌ ఉంది. తెలుగులో టీజర్‌కు పవన్‌ కళ్యాణ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చిన విషయం తెల్సిందే.

ఇక పవన్‌ కళ్యాణ్‌ వాయిస్‌ కేవలం టీజర్‌ వరకేనా లేదంటే మొత్తం సినిమాలో ఉంటుందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో టీజర్‌ లాంచ్‌ కార్యక్రమంలో చిరంజీవి క్లారిటీ ఇచ్చాడు. కేవలం టీజర్‌లోనే కాకుండా సినిమాలో కూడా పవన్‌ వాయిస్‌ ఓవర్‌ ఉంటుందని చెప్పుకొచ్చాడు. తెలుగులో నా తమ్ముడు పవన్‌ వాయిస్‌ ఇస్తే తమిళంలో కమల్‌ హాసన్‌ వాయిస్‌ ఓవర్‌ ఇవ్వనున్నాడు, మలయాళంలో మోహన్‌లాల్‌ వాయిస్‌ ఓవర్‌ ఇస్తాడని చిరంజీవి చెప్పుకొచ్చాడు.