Site icon TeluguMirchi.com

‘భోళా శంకర్’ ట్రైలర్ లాంచ్ చేయనున్న గ్లోబల్ స్టార్..


మెగాస్టార్ చిరంజీవి మోస్ట్ ఎవైటెడ్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘భోళా శంకర్’. స్టైలిష్‌ మేకర్‌ మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ ట్రెమండస్ రెస్పాన్స్ తో సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజైన పోస్టర్స్, టీజర్, పాటలు సినిమాపై అంచనాలను మరింతగా పెంచేసాయి. అయితే ఇప్పుడు ఈ చిత్రం నుండి మరో బిగ్ అప్డేట్ వచ్చింది.

భోళా శంకర్ థియేట్రికల్ ట్రైలర్‌ను జూలై 27న విడుదల చేయనున్నట్లు ఇటీవలే చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ట్రైలర్ ను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ రేపు సాయంత్రం 04:05 గంటలకు డిజిటల్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాను ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై రామబ్రహ్మం సుంకర, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో తమన్నా కథానాయకిగా నటిస్తుండగా, సోదరిగా కీర్తి సురేష్ నటిస్తోంది. ఇక అక్కినేని హీరో సుశాంత్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఇక ఈ చిత్రం ఆగస్టు 11న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.

Exit mobile version