Site icon TeluguMirchi.com

మెగా, కొరటాల మూవీ అప్‌డేట్స్‌

చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఒక చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెల్సిందే. అయితే గత సంవత్సర కాలంగా ఈ సినిమా గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. భరత్‌ అనే నేను చిత్రం గత ఏడాది సమ్మర్‌లో విడుదలైంది. ఆ సినిమా విడుదలైనప్పటి నుండి కూడా చిరంజీవితో కొరటాల తర్వాత మూవీ అంటూ వార్తలు వచ్చాయి. కాని చిరంజీవి సైరా నరసింహారెడ్డి చిత్రీకరణ ఆలస్యం అవుతూ వచ్చిన కారణంగా ఈ చిత్రం కూడా ఆలస్యం అయ్యింది.

ఎట్టకేలకు సైరా చిత్రీకరణ పూర్తి అయ్యింది. తాజాగా చిరంజీవి ఈ చిత్రంలో నటించేందుకు సిద్దం అయ్యాడు. వచ్చే నెలలో చిరంజీవి బర్త్‌డే ఉంది. ఆ బర్త్‌డే రోజున సినిమాను లాంచనంగా ప్రారంభించి ఆ తర్వాత నెల సెప్టెంబర్‌ లేదా అక్టోబర్‌లో సినిమాను రెగ్యులర్‌ షూట్‌లోకి తీసుకు వెళ్లబోతున్నారు. ఈ చిత్రంలో చిరంజీవి డబుల్‌ రోల్‌లో కనిపించబోతున్నాడు. పల్లెటూరు నేపథ్యంలో సినిమా ఉంటుంది. మొదటి షెడ్యూల్‌ను పలాసలో చిత్రీకరించబోతున్నారు. అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మొదటి షెడ్యూల్‌ను 20 రోజుల పాటు పలాసలో చిత్రీకరించి అక్కడ నుండి హైదరాబాద్‌ రామానాయుడు స్టూడియోలో సెకండ్‌ షెడ్యూల్‌ ఉంటుందట.

Exit mobile version