భారీ రేటుకు ‘సైరా’ హక్కులు

మెగాస్టార్‌ చిరంజీవి, సురేందర్‌ రెడ్డి కాంబోలో తెరకెక్కిన ‘సైరా’ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్‌ 2న విడుదల కానుంది. పాన్‌ ఇండియా కథతో చిరు సినిమా అయిదు భాషల్లో విడుదలకు సిద్దం అవుతుంది. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో ‘సైరా’ తెరకెక్కింది. ఈ చిత్రాన్ని రామ్‌చరణ్‌ దాదాను 300కోట్ల బడ్జెట్‌తో నిర్మించాడు. తాజాగా ఈ చిత్ర శాటిలట్‌ హక్కులు భారీ రేటుకు అమ్ముడుపోయాయి. 125కోట్లకు ప్రముఖ టీవీ ఛానెల్‌ జీ టీవీ ‘సైరా’ను భారీ మొత్తం వెచ్చించి శాటిలైట్‌, డిజిటల్‌ హక్కులను సొంతం చేసుకుంది.

ఈ చిత్రానికి థియేట్రికల్‌ హక్కుల ద్వారా ఇప్పటికే 175కోట్ల బిజినెస్‌ జరిగింది. 45కోట్ల మేరకు మిగతా భాషల్లోని హక్కులు అమ్ముడు పోయాయి. విడుదలకు ముందే దాదాపు 50 కోట్లకు తగ్గకుండా లాభాలను తెచ్చిపెట్టింది. చిరు డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ ‘సైరా’ పై రామ్‌చరణ్‌ పెట్టిన మొత్తానికి సులభంగా లాభాలు వస్తాయని ట్రేడ్‌ వర్గాల వారు అంచనా వేస్తున్నారు. ఈ చిత్రంలో చిరు సరసన నయనతార నటించింది.