Site icon TeluguMirchi.com

కవలలకు జన్మనిచ్చిన గాయని చిన్మయి

ప్రముఖ గాయని చిన్మయి ఇద్దరు కవలలకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని చిన్మయి, ఆమె భర్త, నటుడు రాహుల్‌ రవీంద్ర సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. చిన్నారుల చేతులను ఫొటో తీసి, దాన్ని నెట్టింట షేర్‌ చేశారు. “ద్రిప్త, శర్వస్… మా ప్రపంచంలోకి కొత్తగా వచ్చినా, జీవితాంతం మాతోనే ఉండిపోయే అతిథులు” అని రాసుకొచ్చారు. రాహుల్‌ పెట్టిన పోస్ట్‌ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అది చూసిన సెలబ్రిటీలు, నెటిజన్లు ఈ దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.

2014 లో రాహుల్ – చిన్మయి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ప్లేబ్యాక్‌ సింగర్‌, డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు సంపాదించిన చిన్మయి మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు. మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని దక్షిణాదిని ఉవ్వెతున ప్రచారం చేశారు. ఇకరాహుల్ ‘అందాల రాక్షసి’చిత్రంతో టాలీవుడ్‌కి పరిచమయ్యాడు. హీరోగానే కాకుండా సహాయనటుడిగాను పలు సినిమాల్లో నటించాడు. నాని ‘శ్యామ్‌ సింగరాయ్‌’లో రాహుల్‌ పాత్రకు ప్రశంసలు దక్కాయి.

Exit mobile version