రాహుల్‌కి పెళ్లి కుదిరింది

Chinmayi---Rahul-to-enter-wedlockఅందాల రాక్షసి, పెళ్లిపుస్తకం సినిమాల‌తో అల‌రించిన క‌థానాయ‌కుడు రాహుల్‌. ఇప్పుడు నిజ జీవితంలో నిజంగానే పెళ్లి పేజీలు తిప్పబోతున్నాడు. అవును.. రాహుల్‌కి పెళ్లి కుదిరింది. పెళ్లి కూతురు ఎవ‌రో కాదు. ప్రముఖ డ‌బ్బింగ్ ఆర్టిస్ట్ చిన్నయి. వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన వివాహ‌మే. వ‌చ్చే యేడాది ప్రధ‌మార్థంలో రాహుల్ – చిన్మయి ఒక్కటి కాబోతున్నారు. వ‌రుస సినిమాల‌తో ఇటు రాహుల్‌, అగ్ర క‌థానాయిక‌కు గాత్రదానం చేస్తూ చిన్మయి బిజీ బిజీగా ఉన్నారు. రాహుల్ న‌టించిన నేనేం చిన్నపిల్లనా విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది.