కమల్ హసన్ ‘చీకటి రాజ్యం ‘ ఫస్ట్ లుక్

firstlook-cheekatirajyam3విశ్వ రూపం, ఉత్తమ విలన్ వరుస ఫ్లాప్స్ తో సతమవుతున్న కమల్ హసన్, ఈసారి ఖచ్చితంగా విజయం సాదించాలని కసితో ‘చీకటి రాజ్యం ‘ అనే చిత్రం తో మరోసారి తన అదృష్టాన్ని పరిక్షించుకొబోతున్నాడు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ని తాజాగా విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో కమల్ హాసన్, త్రిష్, ప్రకాశ్ రాజ్, దర్శకుడు రాజేశ్ యం. సెల్వ తదితరులు హాజరయ్యారు. తెలుగు, తమిళ భాషల్లో తన సొంత సంస్థ రాజ్‌కమల్ ఇంటర్నేషనల్ పతాకంపై కమల్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

త్రిష, ప్రకాశ్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటించగా, ‘తూంగా వనం’ అనే టైటిల్ ని తమిళ్ లో ఖరారు చేశారు. ఓ థ్రిల్లర్ స్టోరీగా ఇది తెరకెక్కనుంది. ఈ చిత్రంలో కమల్ హాసన్ పోలీసు అధికారిగా కనిపించనున్నారు.