Site icon TeluguMirchi.com

రూమర్స్ కి చెక్ పెట్టిన చైతు

అక్కినేని నాగచైతన్య తన కొత్త సినిమాలపై క్లారిటీ ఇచ్చాడు. నాగచైతన్య చేయబోతున్న సినిమాలపై కొంతకాలంగా వదంతులు వెలువడుతున్నాయి. నాగచైతన్య-బాబి కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతోందని, సతీమణి సమంతతో కూడా ఓ సినిమా చేస్తున్నట్లు, మరోపక్క రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి జోడీగా ఓ సినిమాలో నటిస్తున్నారని వదంతులు వినిపిస్తున్నాయి.

దాంతో ఈ వదంతులకు చైతన్య ఒక్క ట్వీట్‌తో ఫుల్‌స్టాప్‌ పెట్టాడు. తన సినిమాల గురించి వస్తున్న వార్తలు నిజం కాదని తెలిపారు. ‘నా సినిమాల గురించి వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదు. ప్రస్తుతం ‘సవ్యసాచి’, ‘శైలజా రెడ్డి అల్లుడు’ చిత్రాల్లో నటిస్తున్నాను. ఈ రెండు సినిమాలు చక్కగా రూపుదిద్దుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. మంచి కంటెంట్‌ ఉన్న కథలు వింటున్నాను. నా తదుపరి సినిమాల గురించి త్వరలో వెల్లడిస్తాను’ అని చెప్పుకొచ్చాడు

Exit mobile version