‘‘చావు కబురు చల్లగా’ ఫస్ట్ లుక్ చూసారా..?

రీసెంట్ గా 90 ఎంఎల్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కార్తికేయ..చావు కబురు చల్లగా చెప్పాడు. అదేంటి అనుకుంటున్నారా ..కార్తికేయ కొత్త చిత్ర టైటిల్ అదే మరి. స్మాల్ హీరోలతో సినిమాలు ప్రకటిస్తున్న వస్తున్న గీత్ ఆర్ట్స్ 2.. తాజాగా కార్తికేయ తో ఈ సినిమా చేస్తుంది. కౌశిక్ పెగళ్లపాటి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్ గురువారం ప్రారంభమైంది. ఈరోజు కార్తికేయ పుట్టిన రోజు సందర్బంగా చిత్ర ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసి ఆసక్తి నింపారు.

ఈ సినిమాలో ‘బస్తీ బాలరాజు’ పాత్రలో కార్తికేయ కనిపించనున్నాడు. ఇక ఫస్ట్ లుక్ లో శవాలను స్మశానానికి తీసుకెళ్లే వాహనంపై నుంచుని దమ్ముకొడుతూ ఆయన కనిపిస్తున్నాడు. గళ్ల షర్టు పైకి మడిచి .. లుంగీ పైకి కట్టి పూర్తి మాస్ లుక్ తో కనిపించాడు. ఈ సినిమాకి జాక్స్ బిజోయ్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు.