ఛార్మి పెళ్లి కి గ్రీన్ సిగ్నల్..

హాట్ భామ ఛార్మి ని పెళ్లి చేసుకోవడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అందాల తార త్రిష…అదేంటి అనుకుంటున్నారా..? తాజాగా త్రిష 33 వ ఏటా అడుగుపెట్టిన సందర్భాంగా ఆమెకు చాలామంది సినీ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. వీరిలో ఛార్మి కూడా ఉంది..

‘పుట్టినరోజు శుభాకాంక్షలు త్రిష. త్వరగా తిరిగి రా.. పార్టీ చేసుకుందాం. అలాగే నేను చేసిన పెళ్లి ప్రతిపాదనను ఈ ఏడాదైనా పరిగణనలోకి తీసుకో..’ అంటూ ట్విటర్‌లో చార్మీ ట్వీట్‌ చేసింది. ఛార్మి ట్వీట్స్ కు త్రిష స్పందిస్తూ ‘నన్ను పెళ్లి చేసుకోవాలన్న ఇష్టాన్ని వ్యక్తపరిచిన రోజే సమ్మతం తెలిపాను. లవ్‌ యూ’ అంటూ బదులిచ్చారు. వీరిద్దరి సాన్నిహిత్యం చూసి అందరూ వీరి ఫ్రెండ్ షిప్ గురించి మాట్లాడుకుంటున్నారు.