Site icon TeluguMirchi.com

ఛార్మి కోరికను పూరి కాదనలేకపోయాడు..

టెంపర్ తరువాత డాషింగ్ డైరెక్టర్ పూరి కి ఒక్క హిట్ కూడా రాలేదు..కనీసం ఈయనతో సినిమాలు చేసేందుకు కూడా ఎవరు ముందుకు రాకపోయేసరికి..నటి ఛార్మి పూరి తో సహా నిర్మాతగా చేరి ఇద్దరు కలిసి సినిమాలు నిర్మించడం మొదలు పెట్టారు. అయినాగానీ ఒక్క హిట్ కూడా రాలేదు. ఈ నేపథ్యంలో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసి తో ఇస్మార్ట్ శంకర్ అంటూ మాస్ మసాలా సినిమా చేసారు. ఈ సినిమా థియేటర్స్ లోకి వచ్చి మాములు హడావిడి చేయడం లేదు. ఏ నోటా విన్న ఇస్మార్ట్ అనే మాట వినిపిస్తుంది. ఇక కలెక్షన్ల గురించి చెప్పాల్సిన పనే లేదు. బయ్యర్లు అంత మొదటి వారానికే లాభాల బాట పట్టారు.

ఇక చిత్ర యూనిట్ రోజు పండగే చేసుకుంటున్నారు. నిర్మాత..డైరెక్టర్..హీరోయిన్లు ఇలా అంత ఉన్నారు కానీ రామ్ మాత్రం మిస్ అయ్యాడు. సినిమా రిలీజ్ కు ముందు రామ్ అమెరికా వెళ్ళాడు. రిలీజ్ సమయంలో కూడా అక్కడే ఉన్నాడు. మరో రెండు రోజుల్లో రామ్ ఇండియాకు వస్తున్నారు. రామ్ వచ్చిన తరువాత హీరోతో కలిసి మరో పార్టీ చేయాలని ఛార్మి దర్శకుడు పూరిని కోరింది. నిర్మాత అడిగితె దర్శకుడు కాదంటారా చెప్పండి. వెంటనే ఒకే చెప్పేశాడు. రామ్ హైదరాబాద్ రాగానే.. జోష్ ఉండే పార్టీని చేసుకోవాలని ఛార్మి ప్లాన్ చేస్తుంది. మరి ఈ పార్టీ కి ఎవరెవరు వెళ్తారో..ఏ రేంజ్ లో పార్టీ ఉంటుందో చూడాలి.

Exit mobile version