Site icon TeluguMirchi.com

ఇస్మార్ట్ దుస్తులు మీకోసం..

రామ్ – పూరి కాంబినేషన్లో ఇస్మార్ట్ శంకర్ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్ర షూటింగ్ చివరి దశలో ఉంది. జులై నెలలో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్లఫై చిత్ర యూనిట్ ప్రత్యేక శ్రద్ద పెట్టింది. అందులో భాగంగా ఇస్మార్ట్ శంకర్ లో వాడిన దుస్తులను అందించబోతున్నారు.

ఐస్పెషల్ పేరుతో ఓ క్లాతింగ్ బ్రాండ్ ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందులో ఐస్మార్ట్ శంకర్ లో హీరో హీరొయిన్లతో సహా లీడ్ క్యాస్టింగ్ అంతా వాడిన కాస్ట్యూమ్స్ అందించబోతున్నారు. అయితే దీనికి బీఐస్మార్ట్ డాట్ ఇన్ అనే వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలి. ఆ తర్వాత కావాల్సినవి ఎంచుకునే ఆప్షన్ దక్కుతుంది. తాజాగా ఆ దుస్తుల మధ్య ఛార్మి ఫోటో దిగి దానిని సొషల్ మీడియా లో షేర్ చేసింది.

మిస్టర్ మజ్ను ఫేమ్ నిధి అగర్వాల్ , నభ నటేష్ హీరోయిన్ లుగా నటిస్తున్న ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా ఫై పూరి & రామ్ గట్టి ఆశలే పెట్టుకున్నారు.

Exit mobile version