ఈ ఇద్దరు చాలా సన్నిహితంగా ఉంటారు. ఇక పూరీ చిత్రాల అన్ని వ్యవహారాలు కూడా చార్మినే చూసుకుంటోంది. ఈ విషయాన్ని ఏది దాచకుండా అటు పూరీ, ఇటు చార్మిలు ఓపెన్‌గానే చెబుతారు. గతకొంత కాలం నుండి చార్మి నటనను వదిలేసి పూరీ కనెక్ట్స్ సంస్థ వ్యవహారాలు అన్ని చూసుకుంటోంది.
పూరీ కనెక్ట్స్ సంస్థకు అన్నీ చార్మినే, యాడ్ ఏజెన్సీతో పాటు మేనెజ్‌మెంట్, కాస్టింగ్, ఈవెంట్స్, ప్రొడక్షన్ వంటి వాటిని మొత్తం కూడా చార్మినే చూసుకుంటుంది. ‘రోగ్’ చిత్రంతో సినిమాటోగ్రఫర్‌గా పరిచయం అవుతున్న ముఖేష్ కూడా పూరీ కనెక్ట్స్ నుండి వచ్చిన వ్యక్తినే. ఈ సంస్థ నుండి ఇతర చిత్రాలకు కూడా హీరోయిన్లను అందిస్తున్నాం, కేవలం స్టార్లతోనే కాకుండా కొత్తవారితో కూడా సినిమాలు చేస్తే ఆ కిక్కే వేరుంటుంది. అందుకే మా పూరీ కనెక్ట్స్ సంస్థను ఏర్పాటు చేశాం, ఆ సంస్థ భాద్యతలు అన్నీ కూడా ప్రస్తుతానికి చార్మీనే చూసుకుంటుంది, నా కోసం కెరియర్‌ను పక్కనపెట్టి మరీ అన్ని చూసుకుంటోంది చార్మి అని పూరీ జగన్నాధ్ ఓ ఇంటర్య్వూలో చెప్పుకొచ్చాడు.