Site icon TeluguMirchi.com

సౌత్ ‘క్వీన్’ చార్మీ..?

 

సౌత్ ‘క్వీన్’గా అందాల చార్మీ ఎంపికైనట్లు సమాచారమ్. బాలీవుడ్ లో సూపర్ హిట్టయిన చిత్రం ‘క్వీన్’. కంగాన రౌనత్ లీడ్ రోల్ పోషించింది. కంగాన నటనకు బాలీవుడ్ ఫిదా అయిపోయింది. సౌత్ లోకి ‘క్వీన్’ను తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు త్యాగరాజన్ ఈ సినిమా సౌత్ రీమేక్ రైట్స్ తీసుకున్న సంగతి మనకు తెలిసిందే. కంగాన పాత్ర కోసం ఇప్పటికే నయన తార, అనుష్క, సమంత.. పరిశీలించినా బిజీ తారలెవ్వరూ ముందుకు రాలేదు. దీంతో.. ఆఫర్ ఛార్మి చేతికి చిక్కింది. ‘క్వీన్’గా కనబడటానికి ఛార్మి డబుల్ ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు టాలీవుడ్ సమాచారమ్. ఇక సౌత్ ‘క్వీన్’కు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది.

Exit mobile version