Site icon TeluguMirchi.com

చెర్రీ రాకింగ్ లుక్

yevadu-‘తుఫాన్’ ట్రైలర్ ఇచ్చిన ట్రీట్ నుండి మెగా అభిమానులు తేరుకోక ముందే ‘ఎవడు’ రూపంలో మరో రాకింగ్ ట్రైలర్ విడుదల చేసి ఫాన్స్ కు మెగా బర్త్ డే గిఫ్ట్ ఇచ్చాడు తుఫాన్ ట్రైలర్ లో యాంగ్రీ పోలిస్ ఆఫీసర్ గా కనిపించిన చెర్రీ ఎవడు ఫస్ట్ లుక్ లో రాకింగ్ లుక్ తో అదరగొట్టాడు. కేవలం 30 సెకన్ ల నిడివి గల ఈ ట్రైలర్ లో చరణ్ యాక్షన్, దేవి మ్యూజిక్ మ్యాజిక్, వినూత్న ఫోటోగ్రఫీ చూపించాడు దర్శకుడు పైడిపల్లి వంశీ. ట్రైలర్ చూస్తుంటే ఓ యాక్షన్ థ్రిల్లర్ ని తలపిస్తుంది. చరణ్ లుక్ అదిరిపోయింది. ఈ ట్రైలర్ తో మూవీ పై మరిన్ని అంచనాలు పెరిగాయి. అప్పుడే చరణ్ ‘ఎవడు’ సినిమాలో ఎవరు అని తెలుసుకోవడానికి వేట మొదలైంది. అసలు చెర్రీ ‘ఎవడు’ అని తెలియాలంటే వేసవి వరకు ఆగాల్సిందే.

Exit mobile version