Site icon TeluguMirchi.com

చెర్రీకి ‘ఫ్రీడ‌మ్‌’ కావాల‌ట‌!

cherrycharan cherryరామ్‌చ‌ర‌ణ్ సినిమాలంటే డాన్సులు ఓ రేంజులో ఉంటాయ‌ని ఫ్యాన్స్ ఆశ‌లు పెంచుకొంటారు. దానికి అనుగుణంగానే చ‌ర‌ణ్ కూడా నృత్యాల విష‌యంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటూ వ‌చ్చాడు. ఎవ‌డులో కూడా అదిరిపోయే స్టెప్పులు ఉన్నాయ‌ట‌. ముఖ్యంగా ఫ్రీడ‌మ్ పాట‌లో నృత్యాలు కొత్తగా ఉండాల‌ని.. చ‌ర‌ణ్ త‌గిన జాగ్రత్తలు తీసుకొంటున్నాడు. ఈ సినిమాలో చర‌ణ్ పై ఓ ఇంట్రడ‌క్షన్ పాట తీయ‌బోతున్నారు. అదే.. ఫ్రీడ‌మ్‌. హైద‌రాబాద్ రోడ్లమీద చ‌ర‌ణ్ పై ఈ గీతాన్ని తెర‌కెక్కించాల‌ని చిత్రబృందం భావిస్తోంది. ఈ పాట‌తో చిత్రీక‌రణ పూర్తయిపోతుంది. ఈనెలాఖరున ఎవ‌డు చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాల‌ని నిర్మాత దిల్‌రాజు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే పాట‌ల‌కు వ‌స్తున్న రెస్పాన్స్ ఓ రేంజులో ఉంద‌ని, సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుంద‌ని ఎవ‌డు టీమ్ న‌మ్మకంగా చెబుతోంది.

Exit mobile version