Site icon TeluguMirchi.com

వామ్మో… భయపెడుతున్న చరణ్‌ లుక్‌

ram charan 1మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరన్‌ ‘ధృవ’ చిత్రంతో మంచి సక్సెస్‌ను అందుకున్నాడు. అంతేకాకుండా తండ్రి చిత్రాన్ని నిర్మించి భారీగా లాభాలను పొందాడు. ఇలా మాంచి జోషు మీదున్న చరణ్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు. పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం రాజమండ్రి సమీప ప్రాంతాలలో చిత్రీకరణ జరుపుకుంటుంది. తాజాగా ఈ చిత్ర స్టిల్స్‌ కొన్ని లీకయ్యాయి. వాటిలో ఉన్నది ఎవరో గుర్తు పట్టాంటే కాస్త ఆలోచించాల్సిందే మరి. గుబురు గడ్డం, లుంగీ కట్టుకుని భుజాన తువ్వాలు వేసుకుని చేతిలో కర్రపట్టుకుని నిల్చున్న ఈ ఊర మాస్‌ వ్యక్తి ఎవరా అనుకుంటున్నారా! ఆయనే మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌. ఈ చిత్రం కోసం గుబురు గడ్డాన్ని పెంచి అలా పల్లెటూరి కుర్రాడిలా తన లుక్‌ మొత్తం మార్చేశాడు చెర్రీ.


ram charan 2చూడడానికి పాత్రలో బాగా సెట్‌ అయ్యాడు కానీ ఈ పోష్‌ కల్చర్‌లో చెర్రీని అభిమానులు అలా స్వీకరిస్తారా అనేది సందేహంగానే ఉంది. చరణ్‌ లుక్‌ను చూసిన వీరాభిమానులు భయపడుతున్నారు. మరీ ఇంత దారుణంగా ఊర మాస్‌ లుక్‌లో చరణ్‌ వెండి తెర మీదకు వచ్చి ఆకట్టకోగలుగుతాడా.?? అనే అనుమానాలు ఇప్పటి నుండే మొదలయ్యాయి. కాని చరణ్‌ మాత్రం సుకుమార్‌ మీద ఉన్న నమ్మకంతో ఈ ఊర మాస్‌ లుక్‌కు సైతం ఒప్పుకున్నాడు. చెర్రీ ఈ చిత్రంలో చెవిటి వ్యక్తిగా నటిస్తున్నాడు అనే వార్త కూడా జోరుగా ప్రచారం అవుతోంది. ఈ చిత్రంలో చెర్రీ సరసన సమంత హీరోయిన్‌గా నటిస్తోంది.

Exit mobile version