Site icon TeluguMirchi.com

మెగా మూవీ లో మెగా పవర్ స్టార్..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం సైరా నరసింహ రెడ్డి చిత్రం తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉండగానే కొరటాల మూవీ ని సెట్స్ పైకి తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు ఏడాది గా శివ ఈ చిత్రం కోసం వెయిట్ చేస్తున్నాడు.ప్రస్తుతం ప్రీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుతున్న శివ..ఈ మూవీ లో ఓ కీలక పాత్ర కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనేది తెలియనప్పటికీ..ఈ వార్త బయటకు రాగానే మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

కమర్షియల్ అంశాలతో కూడిన సోషల్ కాన్సెప్ట్ తో రానున్న ఈ చిత్రం చిరంజీవి పుట్టిన రోజైన ఆగస్టు 22న లాంఛనంగా ప్రారంభం కానుంది. చిరు సరసన హీరోయిన్ గా ఎవర్ని ఎంపిక చేస్తున్నారనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం కాజల్ , శృతి హాసన్ , తమన్నా , నయనతార ల పేర్లు ప్రచారం అవుతున్నాయి. ఇక ఈ చిత్ర మొదటి షెడ్యూల్ షూటింగ్ శ్రీకాకుళం జిల్లా పలాసలో మొదలు పెట్టనున్నారని తెలుస్తుంది. ప్రజారాజ్యం ఎన్నికల సమయంలో అక్కడికి వెళ్లిన మెగాస్టార్ మళ్లీ ఇన్నేళ్లకు అక్కడికి షూటింగ్ కోసం వెళ్లనున్నాడు. మరి అక్కడి అభిమానుల మధ్య షూటింగ్ ఎలా జరుగుతుందో చూడాలి. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌తో కలిసి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మించనున్నాడు.

Exit mobile version