మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లో చాల మార్పులు కనిపిస్తున్నాయి..గతం లో చూసిన చరణ్ వేరు , ఇప్పడు చూస్తున్న చరణ్ వేరు. తాజాగా రంగస్థలం మూవీ షూటింగ్ లో జరుగుతున్న సంఘటనలే చరణ్ ఎంత మారిపోయాడో చెపుతున్నాయి. షూటింగ్ జరిగిన ప్రాంతాల్లో చరణ్ ను చూడ్డానికి అభిమానులు ఎగబడుతోంటే, మరోవైపు వీలు చిక్కినప్పుడల్లా చెర్రీ కూడా వారితో మమేకం అవుతూ, వారిలో కలిసిపోతున్నాడు.
ఇవన్నీ ఒక ఎత్తయితే, తాజాగా రంగస్థలం షూటింగ్ జరుగుతున్న లొకేషన్లో జరిగిన సంఘటన ఓ ఎత్తు. చరణ్ ను చూసేందుకు ఓ ఫీమేల్ ఫ్యాన్ షూటింగ్ స్పాట్ కు వచ్చింది. దివ్యాంగురాలు అయిన ఆ యువతి చెర్రీని చూసేందుకు ఎంతో దూరం నుంచి రంగస్థలం సెట్స్‌కి చేరుకుంది. ఆ వీరాభిమాని గురించి తెలుసుకున్న చరణ్.. ఆమెతో కాసేపు సరదాగా ముచ్చటించి, ఓ ఫోటోకి పోజిచ్చి ఆమెని ఆనందంలో ముంచెత్తాడు.
అంతేకాకుండా దివ్యాంగురాలైన ఆమె మళ్లీ ఇంటికి ఎలా చేరుకుంటుందో అని కంగారు పడిన చెర్రీ.. తానే తన సిబ్బందికి కారు ఇచ్చి మరీ ఆమెని ఇంటి వద్ద డ్రాప్ చేసి రమ్మన్నాడట. అభిమాన నటుడుని చూడాలని ఎన్నో వ్యయప్రయాసలకొసగి వచ్చిన వాళ్లకి ఎవరికైనా ఇంతకన్నా ఎక్కువ ఇంకేం కావాలి చెప్పండి. ఇక చరణ్ చేసిన ఈ పనిని గురించి అంత గొప్పగా చెప్పుకుంటూ తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు.