షాక్ : రామ్ చరణ్ మూవీ షూటింగ్ ను అడ్డుకున్నారు..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ షూటింగ్ కు అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ లో జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ ను నిన్న లైట్‌మెన్ అసోసియేషన్ మెంబర్స్ అడ్డుకున్నారు. కొన్ని రోజులుగా లైట్ మేన్స్ కు ఇచ్చే జీతాల విషయంలో గొడవ జరుగుతోంది. చాలా చిన్న సినిమాల షూటింగ్స్‌ని ఆపేస్తూ ఉన్నారు. అయితే పెద్ద సినిమాల విషయంలో మాత్రం ఇప్పటి వరకూ చూసీ చూడనట్టుగా ఉండిపోయారు. దీంతో పెద్ద నిర్మాతలు వారిపై చూడడం మానేశారు. ఇలా అయితే తమ డిమాండ్స్ వర్క్ అవుట్ కావని , ఇక పెద్ద సినిమా షూటింగ్ లను అడ్డుకుంటే కానీ జీతాలు పెరగవని భావించిన లైట్‌మెన్ అసోసియేషన్ , నిన్న రామ్ చరణ్ కొత్త సినిమా షూటింగ్ ను అడ్డుకున్నారు.

హీరో రామ్ చరణ్ సమక్షంలోనే నానా హంగామా సృష్టించారు. గొడవ చేస్తున్న వాళ్ళను సముదాయించడానికి యూనిట్ మెంబర్స్ ప్రయత్నాలు చేసినప్పటికీ వాళ్ళు మాత్రం ససేమిరా అన్నారు. దాంతో చేసేదిలేక షూటింగ్‌కి ప్యాకప్ చెప్పేసి రామ్ చరణ్‌తో సహా చిత్ర యూనిట్ అంత లొకేషన్ నుంచి వెళ్ళిపోయారు. చిన్న సినిమాల షూటింగ్లకు బ్రేక్ పడితే పెద్దగా నష్టం ఉందని కానీ పెద్ద సినిమాల విషయం లో ఇలా జరిగితే భారీ నష్టమే వాటిల్లుతుంది. మరి ఈ గొడవని ఎంత త్వరగా ముగిస్తే అంత మంచిది.