Site icon TeluguMirchi.com

ఓ ‘లవ్ స్టోరి’ కావాలి !

ramcharnఆరెంజ్ త‌ర‌వాత ప్రేమ క‌థ‌లేం చేయ‌లేదు రామ్‌చ‌ర‌ణ్‌. ఇప్పుడు అలాంటి ఓ రొమాంటిక్ క‌థ కోసం వెదుకుతున్నాడ‌ట‌. ఎవ‌డు పూర్తిగా యాక్షన్ ఫార్ములా. త్వర‌లో సెట్స్‌పైకి వెళ్లనున్న కృష్ణవంశీ సినిమా ఎలాగూ ఫ్యామిలీ స్టోరీనే. అందుకే ఈసారి యూత్ ఫుల్ ఎంట‌ర్‌టైన్ మెంట్ చేయాల‌ని భావిస్తున్నాడు. త్రివిక్రమ్ – రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్ ఖ‌రారయ్యే అవ‌కాశాలు దాదాపుగా లేక‌పోవ‌డంతో ప్రత్యామ్నాయ మార్గాల‌ను వెతుక్కొంటున్నాడు చ‌ర‌ణ్‌. అందులో భాగంగానే ప్రేమ‌క‌థా చిత్రాల ద‌ర్శకుడు క‌రుణాక‌ర‌ణ్‌ని పిలిపించాడ‌ట‌. ‘మంచి క‌థ ఉంటే చెప్పు చేద్దాం’ అనే ఆఫ‌ర్ ఇచ్చాడ‌ట‌. క‌రుణ కూడా చ‌ర‌ణ్ ఆఫ‌ర్‌తో ఎగిరి గంతేస్తున్నాడు.

మరి చూడాలి..డార్లింగ్ లాంటి కధ చెబుతాడో.. లేదా ఎందుకంటే ప్రే’మంట’ లాంటి కధను చెప్పి చరణ్ కు మరో ఆరెంజ్  తినిపిస్తాడో.. ! వెయిట్ అండ్ సీ..

Exit mobile version