‘గుండెజారి..’ న చెర్రీ !

Ram-Charan.jpgనితిన్ ఖాతాలో ‘గుండె జారి గల్లంతయ్యిందే’ రూపంలో మరో హిట్ జమయింది. ఇటీవల విడుదలయిన ఈ సినిమా సక్సెస్ బాటలో పయనిస్తూ.. మంచి కలెక్షన్లతో దూసుకుపోతోంది. కేవలం 11 రోజుల్లోనే 11.26 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా ఇటు నిర్మాత అటు అగ్ర హీరోల గుండెజారేలా చేసింది. ఈ చిత్రాన్ని చూసిన స్టార్ హీరోలు చిత్ర దర్శకుడు విజయ్ కుమార్ కు ఫోన్లు చేసి అభినందిస్తున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అయితే ఏకంగా తనతో సినిమా చేయడానికి విజయ్ కుమార్ కు అవకాశం కూడా ఇచ్చాడట. ‘గుండె జారి..’ ప్రేమకథను దర్శకుడు డీల్ చేసిన విధానానికి ఫీదా అయిపోయినా చెర్రీ.. తనకు సరిపోయే మంచి కథతో వస్తే చేయడానికి తాను సిద్ధమన్న సంకేతాలను కూడా పంపించినట్టు వార్తలు వస్తున్నాయి. నితిన్ తో ‘గుండెజారి..’ తో ప్రేక్షకుల గుండెలను దోచుకున్న దర్శకుడు విజయ్ కుమార్ తన తదుపరి చిత్రాన్ని ఏ హీరోతో చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది.