రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ కోసం ఎంత ఖర్చు పెడుతున్నారో తెలుసా..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మెగా పవర్ స్టార్ హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ #RRR . డివివి దానయ్య నిర్మాణం లో తెలుగు , తమిళ్, హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకోసం దాదాపు 400 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నామని ప్రెస్ మీట్ లో దానయ్య చెపితే అంత ఉంటుందా అని అంత అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆ లెక్కలు ఒక్కోటిగా బయటకు వస్తుంటే అవి ఇంకా తక్కువనే అవుతాయి కావొచ్చని అంత మాట్లాడుకుంటున్నారు.

ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఓ భారీ పోరాట సన్నివేశం కోసం ఏకంగా రూ. 40 కోట్ల ఖర్చు చేస్తున్నారని..ఈ సన్నివేశంలో 1500 మంది జూనియర్ ఆర్టిస్ట్ లు పాల్గొనబోతున్నట్లు ఇప్పటికే ప్రచారంలోకి వచ్చింది. ఇక తాజాగా మరో వార్త కూడా బయటకు వచ్చి అందరిని షాక్ లో పడేస్తుంది. తాజాగా ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇంట్రడక్షన్ సీన్ కోసమే దాదాపు రూ.22 కోట్లకు పైగా ఖర్చు పెడుతున్నట్టు సమాచారం. కేవలం హీరోల ఇంట్రడక్షన్ లకే ఈ రేంజ్ లో పెడితే సాంగ్స్ , గ్రాఫిక్స్ కు ఇంకా మిగతావాటికి ఇంకా ఏ రేంజ్ లో ఖర్చు పెడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.