Site icon TeluguMirchi.com

ధృవ ఫస్ట్ లుక్ తో ఫ్యాన్స్ హ్యాపీ..

Dhurva-1st-lookమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ రోల్ లో సురేందర్ రెడ్డి దర్శకత్వం లో గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న చిక్త్రం ధ్రువ. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఆగష్టు 15 ఇండిపెండెన్స్ డే సందర్బంగా రిలీజ్ చేయబోతున్నారు. దీంతో అభిమానుల్లో హడావిడి మొదలయ్యింది. చరణ్ ఎలా కనిపించబోతాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే లీకయినా పిక్స్ లలో డిఫరెంట్ గా కట్ చేసిన మీసకట్టు తో చెర్రీ కనిపిస్తున్నాడు.

ఈ చిత్రంలో క్యారెక్టర్ పరంగా చరణ్ స్టన్నింగ్ లుక్ తో అభిమానుల్ని, ప్రేక్షకుల్ని అలరించనున్నాడని తెలుస్తుంది. చ‌ర‌ణ్‌ దీని కోసం స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడట. ఈ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ధృవ చిత్ర నిర్మాణం జరుగుతోంది. తమిళంలో వంద కోట్ల మైలురాయిని దాటిన తని ఒరువన్ చిత్రానికి రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఫెర్‌ఫార్మెన్స్‌, ర‌కూల్‌ ప్రీత్ సింగ్ అందచందాలు చిత్రానికి హైలెట్ గా నిలిస్తే, అరవింద్ స్వామి పెర్ ఫార్మెన్స్ ఈ చిత్రానికి మ‌రో హైలైట్ గా నిలవనున్నాయి. చూద్దాం ఫస్ట్ లుక్ తో అభిమానులు ఎంతవరకు హ్యాపీ గా ఉంటారో.

Exit mobile version