Site icon TeluguMirchi.com

భరత్ ఫై చరణ్ కామెంట్స్..

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను..గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. రెండేళ్ల తర్వాత హిట్ అందుకున్న మహేష్ , ఈ సక్సెస్ ను ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక సినిమా చూసిన ప్రతి ఒక్కరు సినిమా బాగుందని , మహేష్ యాక్టింగ్ అమోగం అంటూ తమ తమ ట్విట్టర్ లలో తెలుపుతుండడంతో మహేష్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.

ఇప్పటికే ఎన్టీఆర్ , రాజమౌళి వంటి స్టార్స్ తమ ట్విట్టర్ లో చిత్ర యూనిట్ కు , అలాగే మహేష్ కంగ్రాట్స్ తెలుపుగా తాజాగా వారి జాబితాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జాయిన్ అయ్యాడు. క్లాసిక్ ఫిల్మ్ అనడానికి ఇది పర్ఫెక్ట్ ఉదాహరణ. ప్రిన్స్ మహేష్ బాబు పర్ఫామెన్స్ పవర్ఫుల్ గా ఉంది. అందమైన కథను దర్శకుడు కొరటాల శివ గారు కరెక్ట్ గా తెరకెక్కించారు.

ఇక దేవి సూపర్ మ్యూజిక్ అందించారు. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అలరించింది. ఔట్ స్టాండింగ్ ఎంట్రీ ఇచ్చినందుకు హీరోయిన్ కైరా అద్వానీకి శుభాకాంక్షలు. ఇక మంచి సినిమాను నిర్మించిన డివివి.దానయ్య గారికి కూడా కంగ్రాట్స్ అంటూ.. మొత్తంగా భరత్ అనే నేను సినిమా చిత్ర యూనిట్ ని ప్రశంసిస్తున్నట్లు రామ్ చరణ్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

Exit mobile version