Site icon TeluguMirchi.com

బాలయ్య బయ్యర్స్ ను భయపెడుతున్న ఛార్మి.

balayya puri

వరుస ప్లాప్స్ తో ఇబ్బందుల్లో ఉన్న పూరి ప్రస్తుతం బాలయ్య తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెల్సిందే..ఇప్పటికే షూటింగ్ జెట్ స్పీడ్ తో సాగుతుంది. మొదటి సారి బాలయ్య -పూరి కాంబినేషన్ లో సినిమా రాబోతుండడం తో ఈ మూవీ రైట్స్ కోసం బయ్యర్స్ పోటీ పడుతున్నారు. అయితే మూవీ బిజినెస్ విషయంలో హీరోయిన్ ఛార్మి బయ్యర్స్ ను బాగా ఇబ్బంది పెడుతోందట. బిజినెస్ లో అంతగా అనుభవం లేని ఛార్మి మాత్రం ప్రాబ్లెమ్స్ క్రియేట్ చేస్తోందట.

అసలు ఛార్మీకి ఈ పిక్చర్ తో ఏమిటి రిలేషన్ అనే ప్రశ్న అందరి మదిలో మెదులుతుంది. ఇక్కడ ఓ విషయం చెప్పాలి. పూరీ – ఛార్మి బిజినెస్ పార్ట్నర్స్. పూరీ కనెక్ట్స్ పేరుతో స్టార్ట్ చేసిన కాస్టింగ్ ఏజెన్సీ బిజినెస్ మొత్తం ఛార్మీనే చూస్తోంది. అయితే పూరీ – బాలయ్య మూవీ బిజినెస్ తో తనకు సంబంధం లేకపోయినా ఛార్మీ ఇన్ వాల్వ్ అవుతోందట.

ఈ సినిమాకు ఏరియా వైజ్ గా ఛార్మి చెబుతున్న రేట్లు వింటుంటే బయ్యర్లకు మైండ్ బ్లాక్ అవుతోందట. ఆ రేట్లు శాతకర్ణి బిజినెస్ రేట్లకంటే కూడా ఎక్కువగా ఉన్నాయట. ఛార్మి చెప్పే రేట్లు విని బయ్యర్స్ డైలమాలో పడ్డారట. ఈ విషయంలో బాలయ్య –పూరీ ఏం చెపుతారో చూడాలి మరి.

Exit mobile version