లెజెండ్ తో చందమామ కథలు

legendబాలయ్య బాబు కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన లెజెండ్ ఈ నెల 28 న విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. లెజెండ్ కోసం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ఆ ఎదురు చూపు కు బోనస్ గా ఇంకొక కిక్కు ఇవ్వబోతున్నారు. ఈ మధ్య కాలంలో విడుదల అయి రెండు నిముషాలు చూస్తున్న అందరిని కట్టిపడేసి, ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తున్న “చందమామ కథలు” ట్రైలర్ ని లెజెండ్ థియేటర్ లలో ఇంటర్వెల్ టైం లో ప్రదర్శిస్తున్నారు.ఇప్పటికే బుల్లి తెర మీద ఎంతో పాపులర్ అయిన ఈ ట్రైలర్ ని ఇప్పుడు వెండి తెర మీద, అదీ బాలయ్య బాబు సినిమా మధ్యలో చూస్తే ఆ ఊపు రెట్టింపు అవుతుంది.ఇదంతా దగ్గరుండి చూడాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.